V6 News

ఇవాళ్టి(ఏప్రిల్26) నుంచి నల్ల చెరువుకు ఉప్పల్ బస్టాప్..ఎండలో చెమటలు కక్కాల్సిందే!

ఇవాళ్టి(ఏప్రిల్26) నుంచి నల్ల చెరువుకు ఉప్పల్ బస్టాప్..ఎండలో చెమటలు కక్కాల్సిందే!

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా యాదగిరిగుట్ట, జనగామ, హనుమకొండ, వరంగల్ వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు స్పీడప్ కావడంతో.. ప్రస్తుతం ఉప్పల్​రింగ్ రోడ్డు వద్ద ఉన్న బస్టాప్​ను తాత్కాలికంగా నల్ల చెరువు వద్దకు తరలించారు. ఈ మార్పు నేటి (ఆదివారం) నుంచే అమలులోకి వస్తుందని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త తెలిపారు.

దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇకపై నల్ల చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ నుంచే బయలుదేరుతాయని, ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. పనులు పూర్తయ్యే వరకు ఈ తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుందన్నారు. అయితే, కనీస వసతులు లేని చోట బస్టాప్ ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తమవుతోంది. నిలబడటానికి నీడ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తదని ప్రయాణికులు చెప్తున్నారు.